సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 01:26:38

ప్రజల మనిషి మాజీ ఎంపీ నారాయణరెడ్డి

ప్రజల మనిషి మాజీ ఎంపీ నారాయణరెడ్డి

  • విగ్రహావిష్కరణలో మంత్రులు వేముల, అల్లోల

మోర్తాడ్‌ : తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి స్వరాష్ట్రం కోసం ఆరాటపడిన గొప్పవ్యక్తి మాజీ ఎంపీ నారాయణరెడ్డి అని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. మహామేధావి, తెలంగాణవాది, పార్టీల ప్రమేయం లేకుండా ఎంపీగా ఎన్నికైన గొప్ప వ్యక్తి దివంగత నారాయణరెడ్డి అని వారు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం సుంకెట్‌ గ్రామంలో గురువారం మాజీ ఎంపీ నారాయణరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎస్సారెస్పీ ముంపు వాసులకు నష్టపరిహారం ఎక్కువగా ఇప్పించారని వారు గుర్తుచేశారు.logo