గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:42

సుహర్ష.. నువ్వు సూపర్‌!

సుహర్ష.. నువ్వు సూపర్‌!

  • అమెరికాలో ఫ్రీ సీటు సాధించడం గర్వకారణం
  • మంచిర్యాల యువతికి మాజీ ఎంపీ కవిత అభినందన
  • సుహర్ష తెలంగాణకే గర్వకారణం
  • వీడియో కాన్ఫరెన్స్‌లో మాజీ ఎంపీ కవిత అభినందన

హైదరాబాద్‌/మంచిర్యాల, నమస్తే తెలంగాణ: అమెరికాలోని అబర్న్‌ యూనివర్సిటీలో సీటు సాధించిన మంచిర్యాలవాసి సుహర్ష తెలంగాణకు గర్వకార ణమని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు. తెలంగాణ బిడ్డ సుహర్ష ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం సంతోషంగా ఉన్నదని కవిత పేర్కొన్నారు. శనివారం సుహర్షతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కవిత.. ఆమెను అభినందించారు. ఆమెకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సుహర్ష నేటి యువతకు ఆదర్శమని, ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. 

సుహర్ష హైదరాబాద్‌ శివారులోని ములుగు తెలంగాణ ఫారెస్టు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ ఫారెస్టు కోర్సు పూర్తి చేసి.. ప్రస్తుతం అమెరికాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ (ఫుడ్‌ అండ్‌ సైన్స్‌ టెక్నాలజీ)లో సీటు సాధించారు. యూనివర్సిటీ నుంచి రూ.50 లక్ష ల ఉపకార వేతనం, ట్యూషన్‌ ఫీజు మినహాయింపు పొందారు. తాను అమెరికాలోని మిసిసిప్పీలో ఎంఎస్‌ చదువుతున్న సమయంలో 500 డాలర్ల ైస్టెఫండ్‌ పొందినట్లు కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. కవిత తనను అభినందించడం ఆనందంగా ఉన్నదని సుహర్ష తెలిపారు. 


logo