శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:06:39

దివ్యాంగుడికి ఆపన్న హస్తం

దివ్యాంగుడికి ఆపన్న హస్తం

  • ప్రత్యేక వాహనం అందజేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

కోరుట్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బోగ వినయ్‌ అనే యువకుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. ఆరేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమైన విషయమై ‘నమస్తే తెలంగాణ’లో ‘అయ్యో పాపం వినయ్‌' శీర్షికన కథనం ప్రచురితమైంది. యువకుడి దీనగాథకు చలించిన మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. వినయ్‌కి ఫోన్‌చేసి ప్రమాద వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని, అన్నివిధాలుగా అదుకుంటానని భరోసానిచ్చారు. వినయ్‌తోపాటు ఆయన తల్లి సు వర్ణను శనివారం హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనంలో వచ్చే ఏర్పా ట్లు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి వినయ్‌కి మూడు చక్రాల ద్విచక్రవాహనాన్ని అందజేశారు. అవసరమైతే ఉద్యోగం ఇప్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ‘నాపై కవితక్క చూపిన ఆదరణ జీవితంలో మర్చిపోను. ఎంతో ఆప్యాయంగా పలుకరించి, నా బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నాకు త్రిచక్రవాహనాన్ని అందించిన కవితక్క, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు రుణపడి ఉంట’ అని వినయ్‌ అన్నారు.


logo