శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:57:39

మా కొడుకు కోలుకున్నాడు

మా కొడుకు కోలుకున్నాడు

  • మాజీ ఎంపీ కవితక్క దయతోనే..
  • రెండేండ్ల క్రితం రూ.26 లక్షల ఎల్‌వోసీ 
  • సాగర్‌ తల్లిదండ్రుల ఆనందం  
  • బాలుడిని త్వరలో కలుస్తానని మాజీ ఎంపీ కవిత ట్వీట్‌

రాయికల్‌ రూరల్‌ : కాలేయ వ్యాధితో బాధపడుతున్న పదేండ్ల బాలుడికి మాజీ ఎంపీ కవిత రెండేండ్ల క్రితం రూ.26లక్షల ఎల్‌వోసి అందజేసి ఆపన్న హస్తం అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో ఆ కుటుంబం కవితకు కృతజ్ఞతలు తెలిపింది. రాయికల్‌ మండలం మైతాపూర్‌కు చెందిన సాగర్‌ కాలేయ వ్యాధి బారిన పడగా అతడి తల్లిదండ్రులు అంజయ్య-అంజమ్మ అప్పులు చేసి పలు దవాఖానల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ద్వారా మాజీ ఎంపీ కవిత దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించి రూ.26 లక్షల ఎల్వోసీ ఇప్పించారు. బాలుడికి శస్త్రచికిత్స చేయించగా పూర్తిగా కోలుకున్నాడు. ఎమ్మెల్యే సంజయ్‌ బుధవారం  మైతాపూర్‌ వెళ్లగా సాగర్‌ను చూసి ఆశ్చర్య పోయారు.  వెంటనే ఈ విషయాన్ని ఆయన కవితకు ట్వీట్‌ చేశారు. ‘అనారోగ్యాన్ని జయించి పూర్తిగా కోలుకున్న సాగర్‌ను త్వరలోనే కలవడం కోసం వేచి చూస్తున్నానని’ ట్విట్టర్‌లో మాజీ ఎంపీ కవిత స్పందించారు.


logo