ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:42:51

పేద విద్యార్థికి మాజీ ఎంపీ కవిత చేయూత

పేద విద్యార్థికి మాజీ ఎంపీ కవిత చేయూత

  • ఐఐఎంలో సీటు సాధించిన మహేశ్‌కు రూ.లక్ష సాయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అతడు చదువుల బిడ్డ.. సరస్వతీ పుత్రుడు..! గొప్ప వర్సిటీలో సీటు వచ్చినా పేదరికం అడ్డుపడింది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆ పేద విద్యార్థికి పెద్ద దిక్కుగా నిలిచి ఫీజు చెల్లించా రు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన కూరాకుల మహేశ్‌ రాంచీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో సీటు సాధించాడు. అతడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వర్సిటీలో చేరాలంటే లక్షలు కావాలి. కానీ, అతడి వద్ద అంత మొత్తం లేకపోవడంతో ట్విట్టర్‌ ద్వారా మాజీ ఎంపీ కవితను సాయం కోరాడు. ఈ నెల 5వ తేదీలోగా వర్సిటీలో ఫీజు కట్టాలని, లేకపోతే సీటు పోతుందని ఆందోళన వ్యక్తంచేశాడు. ఆ ట్వీట్‌ కు స్పందించిన కవిత ఫీజుకు అవసరమైన మొత్తం రూ.లక్ష చెక్కును మహేశ్‌కు అందజేశారు. గొప్ప విద్యా సంస్థలో సీటు సంపాదించినందుకు అతడిని అభినందించారు. పేదరికం ఉన్నత విద్యకు అడ్డుకావొద్దని కవిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


logo