సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 15:50:01

గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా

గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా

నిజామాబాద్ : ఆరోగ్య సమస్యలతో కంటిచూపు మందగించిన గిరిజన బాలికకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. ఆర్మూరు నియోజకవర్గం మాక్లూరుకు చెందిన నందిని చదువులో టాపర్‌. మాక్లూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చదువులో ముందుండంతో పాటు మంచి పెయింటర్‌. అయితే షుగర్‌, థైరాయిడ్‌తో బాధపడుతున్న నందినికి కంటిచూపు క్రమంగా మందగిచింది. నిత్యం ఇన్సులిన్‌ ఇంజక్షన్‌తో కాలం వెళ్లదీస్తుంది. తండ్రి చిన్నప్పుడే మరణిచండం, తల్లి మానసిక వ్యాధితో మంచం పట్టడం ఇటు తనకు వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 


విషయం తెలుసుకున్న కవిత బాలికకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నందినికి మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. బాలికను హైదరాబాద్‌కు తరలించి చికిత్స చేయించారు. కంటి చికిత్స పూర్తవడంతో నందిని ఆరోగ్యం కుదుటపడింది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న నందిని నేడు కవితను కలిశారు.  నందినికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనకు సమాచారం అందించాలని ఉపాధ్యాయులు, బాలిక బంధువులకు సూచించింది. పరీక్షలు రాసేందుకు వెళ్తున్న బాలికకు అభినందనలు తెలిపి ఉత్సాహాన్ని నింపారు. నందిని బొమ్మలు గీసే నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.logo