గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 27, 2020 , 16:40:18

మోహ‌న్‌రావు కుటుంబానికి మాజీ ఎంపీ క‌విత ప‌రామ‌ర్శ‌

మోహ‌న్‌రావు కుటుంబానికి మాజీ ఎంపీ క‌విత ప‌రామ‌ర్శ‌

హైద‌రాబాద్ : తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ ఛైర్ పర్సన్ కల్వకుంట్ల కవిత నేడు పరామర్శించారు. మోహ‌న్‌రావు కొద్ది రోజుల‌ క్రితం ‌అనారోగ్యంతో మరణించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని మోహన్‌రావు ఇంటికి వెళ్ళి ఆయ‌న మృతి ప‌ట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అసోసియేషన్ ‌అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్‌రావు నిరంతరం ‌కృషి చేసేవారని గుర్తుచేశారు‌. మోహన్ రావు మృతి తీరని లోటన్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా ‌అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ‌ఈ‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.logo