శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 17:49:43

ప్రభుత్వ దవాఖానలో సదుపాయాల కల్పనకు మాజీ ఎంపీ కవిత కృషి

 ప్రభుత్వ దవాఖానలో సదుపాయాల కల్పనకు మాజీ ఎంపీ కవిత కృషి

నిజామాబాద్ :  నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలోని కొవిడ్-19 సెంటర్ పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొవిడ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు, మెడిసిన్ ఏర్పాటు  చేయాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ని కోరారు. మాజీ ఎంపీ కవిత చొరవతో నిజామాబాద్ లోని ‌కొవిడ్ సెంటర్ లో మందులతో పాటు, ఇంజెక్షన్లు మరిన్ని ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు మాజీ ఎంపీ కవిత చొరవను స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.


logo