సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 14:37:16

దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం

దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్నహస్తం

కోరుట్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని‌ స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి మాజీ ఎంపీ కవిత ఆపన్న హస్తం అందించారు. వినయ్ దినావస్థపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనానికి చలించిన ఆమె అతడితో నేరుగా మాట్లాడి విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కోరుట్ల పట్టణానికి చెందిన బోగ వినయ్  2014లో హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.‌ స్వగ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించగా రూ.18 లక్షల వరకు ఖర్చుయయ్యాయి. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆరేండ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా మనోవేదనలో ఉన్నారు. వినయ్‌ పరిస్థితిని గమనించి సాయం అందించిన మాజీ ఎంపీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo