ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 11:39:06

ఐసోలేషన్ వార్డును పరిశీలించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

ఐసోలేషన్ వార్డును పరిశీలించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కరోనా విషయంలో భయపడొద్దన్నారు. 

కరోనా నియంత్రణ కోసం  ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.  ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని రకాల మందులను అందజేస్తూ.. పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.


logo