సోమవారం 01 జూన్ 2020
Telangana - May 15, 2020 , 02:56:08

మాజీ ఎమ్మెల్యే పోచయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే పోచయ్య కన్నుమూత

రాజాపేట: ఆలేరు మాజీ ఎమ్మెల్యే చల్లూరు పోచయ్య(87) కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురా నికి చెందిన ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోచయ్య ఘన విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్‌ తరఫున, 1987లో స్వతంత్ర అభ్యర్థిగా, 2002 సీపీఐ నుంచి ఆలేరు నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు భార్య యాదమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ డాక్టర్‌ కుడుదుల నగేశ్‌ తదితరులు పోచయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు.  


logo