శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 14:46:59

తప్పుడు కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి తుమ్మల

తప్పుడు కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం : సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులను విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎవరికీ ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని తెలిపారు. తాను ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో సీఎం కేసీఆర్ ఆదరించి అత్యంత ఉన్నత అవకాశాన్ని కల్పించారన్నారు. 

తాను పార్టీ మారుతానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లోనే కొనసాగి హైదరాబాద్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికల్లో విజయానికి తన వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనకు అత్యంత ఆప్తుడు అని ఆయన నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని తెలిపారు.