మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 18:01:45

ముగిసిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అంత్యక్రియలు

ముగిసిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి అంత్యక్రియలు

మహబూబ్ నగర్ :  మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత కమతం రాంరెడ్డి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం గండిడ్ మండలం మోహమ్మదాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  స్థానిక నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. 

కమతం రాంరెడ్డి 1967లో జరిగిన ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం 1972, 1989లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1968లో చీఫ్‌విప్‌గా, 1977లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా సేవలందించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.