శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:02:14

కరీంనగర్‌ జెడ్పీ మాజీ చైర్మన్‌ కేవీ రాజేశ్వర్‌రావు మృతి

కరీంనగర్‌ జెడ్పీ మాజీ చైర్మన్‌ కేవీ రాజేశ్వర్‌రావు మృతి

మెట్‌పల్లి: ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ మాజీ చై ర్మన్‌, మెట్‌పల్లి ఖాదీ గ్రా మోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల వెంకటరాజేశ్వర్‌రావు (80) మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో బు ధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచా రు. 2001లో టీఆర్‌ఎస్‌ తరపున మెట్‌పల్లి నుంచి జెడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్‌ జెడ్పీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజేశ్వర్‌రావుకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.  


logo