బుధవారం 08 జూలై 2020
Telangana - Jan 30, 2020 , 23:16:50

గ్రామగ్రామాన అక్షరదీపాలు వెలిగించాలి

గ్రామగ్రామాన అక్షరదీపాలు వెలిగించాలి

రవీంద్రభారతి: మిషన్‌ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి గంగమ్మతల్లిని ప్రసాదించినట్టు చదువుల తల్లి సరస్వతీదేవి అక్షరదీపాలను వెలిగించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు సూచించారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో వెలువరించిన మూడు పుస్తకాలను మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాద్‌రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. మాతృభాషను మరువకూడదని, మాతృభాషలో విద్యాబోధన జరిగితేనే పునాదులు గట్టిగా ఉంటాయ ని, సీఎం కేసీఆర్‌ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని కితాబిచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం లో అక్షరాస్యత పెంచేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని, మా తృభాషను విస్మరించకూడదని చెప్పారు. సంస్థ వ్యవస్థాపకులు వెలిచాల కొండలరావు స్వాగతం పలికి, కార్యక్రమ నేపథ్యాన్ని వివరించారు.


logo