ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 16:03:08

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ భేటీ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ భేటీ

హైదరాబాద్ : క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ భారత జట్టు కెప్టెన్, హెచ్ సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ తో హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ తరువాత రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.  క్రికెట్ క్రీడాకారులు బౌలింగ్ చేసేటప్పుడు బాల్ కు నోటిలోని ఉమ్మిని అంటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలని మంత్రి సూచించారు. క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గుంపుగా, దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మ్యాచ్ గురించి చర్చించటం చేయరాదన్నారు.

క్రీడాకారులు ప్రాక్టీస్ మ్యాచ్ లో మరో టీం కు చెందిన ఆటగాడు ఔటైనప్పుడు మిగతా క్రీడాకారులు చేతులు కలపడం, ఒకరినొకరు పట్టుకొని  ఆనందం వ్యక్తం చేయరాదన్నారు. క్రికెట్ క్రీడాకారులు మ్యాచ్ ప్రాక్టీస్ లో తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలన్నారు.


శానిటైజర్ లను వాడాలని పేర్కొన్నారు. క్రీడాకారులు భౌతిక దూరం పాటించి కోవిడ్ పై ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ను పాటించాలని ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్ కు సూచించారు.  క్రీడాకారుల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి సూచించారు. ప్రభుత్వం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ క్రీడల అభివృద్ధి పై ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. 


logo