Telangana
- Jan 06, 2021 , 21:13:25
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ2 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అఖిలప్రియ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని దాఖలైన పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి.
తాజావార్తలు
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..
- వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్ చర్చలు
- సరికొత్తగా.. సాగర తీరం
MOST READ
TRENDING