ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 00:26:43

డీపీసీ, స్క్రీనింగ్‌ కమిటీల ఏర్పాటుసీఎస్‌ ఉత్తర్వులు

డీపీసీ, స్క్రీనింగ్‌ కమిటీల ఏర్పాటుసీఎస్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధానశాఖలకు చెందిన నాన్‌ క్యాడర్‌లోని అదనపు కార్యదర్శులు, సం యుక్త కార్యదర్శుల పదోన్నతుల కోసం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో కూడిన డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మూడోస్థా యి పోస్టుల పదోన్నతుల కో సం 17 శాఖలకు ప్రభు త్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా చైర్మన్‌గా నలుగురు సభ్యులతో ఒక స్క్రీ నింగ్‌ కమిటీ/ డీపీసీ, మరో 13 శాఖల అధికారుల పదోన్నతులకు ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో మరో స్క్రీ నింగ్‌ కమిటీ/డీపీసీని ఏర్పాటు చేసింది.  


logo