బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 11:30:47

అడవుల పునరుద్ధరణ కోసం పాటుపడాలి : మంత్రి పువ్వాడ

అడవుల పునరుద్ధరణ కోసం పాటుపడాలి : మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం : అడవుల పునరుద్ధరణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి మెడలో పచ్చలహారం వెయ్యాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఊరువాడ ఏకమైందన్నారు. ప్రజలు, ప్రజా ప్రనిధులు, అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని తెలిపారు. 


ఆరో విడుత హరితహారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన  పువ్వాడ అజయ్ కుమార్,  ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎంపీ కవితతో కలిసి మొక్కలు నాటారు. మొదట బూర్గంపాడు మండలం సారపాక దగ్గర, ఆ తర్వాత ఐటీసీ మొయిన్ దగ్గర, భద్రాచలం పట్టణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , కలెక్టర్ ఎంవీ రెడ్జి, భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్ దుండిగల రాజేంద ర్ఉన్నారు.


logo