శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 11:37:33

గోల్కొండలో మానుపిల్లిని బంధించిన అటవీ సిబ్బంది

గోల్కొండలో మానుపిల్లిని బంధించిన అటవీ సిబ్బంది

హైదరాబాద్‌ : నగరంలోని గోల్కొండ పరిధిలో అటవీశాఖ సిబ్బంది మానుపిల్లి(సివిట్‌ క్యాట్‌) ని బంధించింది. గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో బ్లాక్‌ పాంథర్‌ తిరుగుతోందంటూ ప్రచారం జరిగింది. పోలీసులు, స్థానికుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మానుపిల్లిని పట్టుకుంది. బ్లాక్‌ పాంథర్‌గా భావించి స్థానికులు భయాందోళనకు గురైనట్లు పీసీసీఎఫ్‌ శోభ తెలిపారు. మానుపిల్లిని జూపార్క్‌కు తరలించినట్లు తెలిపారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.logo