బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తం

హైదరాబాద్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. కేంద్రం ఆదేశాల మేరకు పీసీసీఏఫ్ ఆర్. శోభ.. చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. బర్డ్ ఫ్లూ కారణంగా హిమాచల్‌ప్రదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలసపక్షులు కూడా ఉన్నాయి.
తాజా పరిస్థితుల్లో వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పక్షుల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్త చెందకుండా చూడాలని కోరింది.
జూ పార్క్ లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని తెలిపారు. తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్లో వలస పక్షుల సంచారం ఉంటుంది కావునా వాటిని కూడా పర్యవేక్షించాలని సూచించారు. పక్షుల అసహజ మరణాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004 255364 కు ఫోన్ చేసి తెలపాల్సిందిగా కోరారు.
తాజావార్తలు
- 20 సినిమాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్‌షాప్‌లు