శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 16:18:42

అటవీ భూములు ఆక్రమించిన వారికి నోటీసులు

అటవీ భూములు ఆక్రమించిన వారికి నోటీసులు

నల్లగొండ : దామరచర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించిన వారికి బుధవారం అధికారులు నోటీసులు జారీ చేశారు.  మండలంలోని కల్లేపల్లి, వాడపల్లి, దిలావర్‌పూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల పరిధిలోని 1500 ఎకరాల అటవీ భూముని 300మంది ఆక్రమించినట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు అటవీశాఖ సెక్షన్‌ అధికారులు మల్లారెడ్డి తెలిపారు. భూములకు సంబంధించి ఎలాంటి ధ్రువ పత్రాలున్నా ఈనెల 8లోగా మిర్యాలగూడ అటవీశాఖ కార్యాలయంలో సంప్రదించాలని లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో అటవీ భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని వెల్లడించారు. 


logo