శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 07:44:50

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఎట్ట‌కేల‌కు చిక్కిన చిరుత‌

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఎట్ట‌కేల‌కు చిక్కిన చిరుత‌

హైద‌రాబాద్‌: గ‌త కొంత‌కాలంగా రాజ‌ధాని శివార్ల‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న చిరుత ఎట్ట‌కేల‌కు బోనులో చిక్కింది. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని వాలంత‌రి వ‌ద్ద ఉద‌యం 4 గంట‌ల‌కు బోనులో చిక్కింది. నిన్న తెల్ల‌వారుజామున‌ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ వ‌ద్ద ఓ ప‌శువుల‌కొట్టంలో రెండు ఆవుదూడ‌ల‌ను చంపి తిన్న‌ది. దీంతో పోలీసులు, అట‌వీశాక అధికారులు చిరుత‌కోసం బోన్లు, సీసీ కెమెరాల‌ను ఏర్పాటుచేశారు. నిన్న చ‌నిపోయిన రెండు ఆవు దూడ‌ల‌ను అందులో ఎర‌గా ఉంచారు. దూడ‌ల‌కోసం వ‌చ్చిన చిరుత బోనులో చిక్కింది. కొన్ని నెల‌లుగా రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో స్థానిక ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్న‌ది.