బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 25, 2020 , 01:55:25

అటవీ సంపదపై నిఘా

అటవీ సంపదపై నిఘా
  • మేడారంలో చెట్లు నరకకుండా అటవీశాఖ చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కోటి మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్మ, సారలమ్మ జాతరలో అటవీ సంపదను రక్షించేందుకు  అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే మహాజాతరకు వచ్చేభక్తులు అటవీప్రాంతాన్ని చదును చేసి, తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొనేందుకు చెట్లను నరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతరకు నిర్దేశించిన ప్రాంతంలోనే పరిధిలోనే గూడారాలు వేసుకొనేలా చర్యలు తీసుకోవాలని, అడవిలో నిప్పు పెట్టకుండా చూడాలని.. అవసరమైన చోట్ల కెమెరాలను ఏర్పాటుచేసి కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షించాలని పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండ్రోజులు క్షేత్రస్థాయిలో ఆమె పర్యటించి సూచనలు చేశారు. ‘వృక్ష ప్రసాదం’ పేరిట భక్తులకు మొ క్కలు పంపిణీ చేయనున్నట్టు వరంగల్‌ సర్కి ల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎంజె అక్బర్‌ తెలిపారు.  


logo