శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 20:22:15

పోలీసుల అదుపులో విదేశీ యాత్రికులు

పోలీసుల అదుపులో విదేశీ యాత్రికులు

చండ్రుగొండ: టూరిజం వీసాపై దేశంలో ప్రయాణిస్తున్న ఓ జంట ద్విచక్రవాహనంపై పర్యటిస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంది. ఓ వృద్ధుడిని ఢీకొట్టారన్న అనుమానంతో వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీకి చెందిన యాత్రికులు రాబర్ట్‌, గ్లోరియా ఈ ఏడాది జనవరి 28న ఇటలీ నుంచి పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చారు. ద్విచక్ర వాహనంపై కేరళతో పాటు ఇతర రాష్ర్టాల్లో పర్యటిస్తూ జిల్లాకు వచ్చారు.

 ఈ క్రమంలో వీరు అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన కె.కాలనీ వద్ద జాతీయ రహదారిపై పోతురాజు భాస్కర్‌రావు అనే వృద్ధుడిని ఢీకొట్టారని 100కు సమాచారం అందడంతో చండ్రుగొండలో పోలీసులు అడ్డుకున్నారు. జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సై రాజేశ్‌కుమార్‌ వారి పాస్‌పోర్టు, వీసాతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ యాత్రికులు చండ్రుగొండ పీఎస్‌ బయటే ఉన్నారు. దీనిపై సీఐ నాగరాజును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.logo