శుక్రవారం 29 మే 2020
Telangana - Jan 30, 2020 , 02:48:40

రూ.50 లక్షల విదేశీ సిగరెట్ల పట్టివేత

రూ.50 లక్షల విదేశీ సిగరెట్ల పట్టివేత
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్వాధీనం

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.50 లక్షలు విలువచేసే విదేశీ నిషేధిత సిగరెట్లను బుధవారం కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. కౌలాలంపూర్‌, మలేషియా, సింగపూర్‌, షార్జా, కంబోడియా, దుబాయ్‌ నుంచి సిగరెట్లను తీసుకొస్తున్నట్టు గుర్తించారు. రెండ్రోజుల వ్యవధిలో నలుగురిని అరెస్టుచేసిన అధికారులు.. రూ.40 లక్షల విలువైన బంగారం, రూ.16.50 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు.

logo