శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 29, 2020 , 20:17:08

మ‌రో మూడు రోజుల పాటు అకాల వ‌ర్షాలు

 మ‌రో మూడు రోజుల పాటు అకాల వ‌ర్షాలు

హైద‌రాబాద్:‌ రాష్ట్రంలో మ‌రో మూడు రోజుల పాటు మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.దక్షిణ చత్తీస్‌గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, పశ్చిమ విదర్భ, ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 ఎత్తున ఉపరిత ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. దీని వ‌ల్ల తెలంగాణ‌లోని ప‌లుజిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు. 


logo