బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 17:49:33

కరోనా నిర్ధారణ కోసం.. సరికొత్త పరీక్ష విధానం

కరోనా నిర్ధారణ కోసం.. సరికొత్త పరీక్ష విధానం

హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఈ మహమ్మారి  కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.   కరోనా వైరస్‌కు వ్యాక్సీన్‌ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మన దేశంలోనూ  నియంత్ర‌ణ‌కు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా నిర్ధారణ కోసం రూపొందించిన కొత్త పరీక్ష విధానం బాధితులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎక్కువ సమయం ఎదురు చూడకుండా ఈ పద్ధతిలో కేవలం అరగంటలోనే ఫలితాలు వస్తాయని సైంటిస్టులు అంటున్నారు.

దీనికయ్యే ఖర్చు కేవలం రూ.300 మాత్రమే. ఈ కొత్త వైద్య పరీక్ష విధానాన్ని హైదరాబాద్ లోని నిమ్స్, ఈఎస్ఐ దవాఖానలు సంయుక్తంగా రూపకల్పన చేశాయి. కాగా, ఐసీఎంఆర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవాళ ఈ కొత్త విధానంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగటివ్ గా నిర్ధారణ అయింది.


logo