సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 21:02:14

గార్లలో పెద్దపులి సంచారం..!

గార్లలో పెద్దపులి సంచారం..!

గార్ల: మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం మూల్కనూరు ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలిసింది. ఓ రైతుకు చెందిన మిరప, పత్తి చేనుల్లో గురువారం పాదముద్రలు కనిపించడంతో అటవీ అధికారులతో కలిసి తహసీల్దార్‌ సయ్యద్‌ రఫీయుద్దీన్‌ ఆ ప్రాంతాన్ని  పరిశీలించారు.   ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను సేకరించి పరీక్షల కోసం పంపారు. ప్రజలెవరూ రాత్రివేళల్లో ఒంటరిగా తిరగవద్దని అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు.