గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 18:23:28

హైదరాబాద్‌లో కమ్మని బోటీ..ఎక్కడంటే?

హైదరాబాద్‌లో కమ్మని బోటీ..ఎక్కడంటే?

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2...సమయం పదకొండు గంటల నుంచి.. రోజంతా రద్దీగానే ఉంటుందా మార్గం!  ఇటు నుంచి అటుగా వెళ్తున్నా.. అటు నుంచి ఇటుగా వస్తున్నా.. ఓ చోట మాత్రం అందరి కండ్లూ ఒకేవైపు చూస్తుంటాయి. అదే పెద్దమ్మ హోటల్‌.. బోటీకి ఫేమస్‌. ‘ఈ బోటీ కూరను కొట్టే కూర ఉండదు.. ఉండబోదు’ అని ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంటుంది. మొత్తం భోజనం ఒకెత్తు.. అవ్వ ప్రత్యేకంగా వండి వడ్డించే బోటీకూర మరొక ఎత్తు. ఆ రుచికి ఎవ్వరైనా చిత్తయిపోవాల్సిందే! మరి హైదరాబాద్‌లో ఆ ‘బోటి’క్‌ హోటల్‌ ఎక్కడుంది..? దాని ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.