సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 22:38:20

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం స్థల పరిశీలన

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం స్థల పరిశీలన

వరంగల్‌(ధర్మసాగర్): మండలంలోని ముప్పారం, దేవునూర్‌ గ్రామాల పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు ఆదివారం అదనపు కలెక్టర్‌ దయానంద్‌, ఆర్డీవో వెంకారెడ్డితో కలిసి స్థల పరిశీలన చేశారు. ముప్పారం గ్రామ పరిధి సర్వే నంబర్‌ 585లో ప్రభుత్వ భూమి మొత్తం 90 ఎకరాలు ఉండగా ఇందులో కొంత టీఎస్‌ ఐపాస్‌కు, కేజీబీవీ, గోదాముల కోసం కేటాయించగా, సుమారు 15 ఎకరాల భూమి ఉందని తహసీల్దార్‌ కలెక్టర్‌కు తెలిపారు. 

అనంతరం 214, 215, 217, 218 తదితర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఇందులో నుంచి గతంలోనే టీఎస్‌ ఐపాస్‌కు 82.14 ఎకరాలను కేటాయించగా 40 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీంతో మండలంలో ఇంకా ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఉన్నట్లయితే పూర్తి వివరాలు తనకు అందజేయాలని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత 54వ డివిజన్‌ పరిధి ఉనికిచర్ల ఎన్‌హెచ్‌ రోడ్డు పక్కనే సర్వే నంబర్‌ 225లో 100 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉందని తెలిపారు. టీఎస్‌ఐఐసీ కోరిన విధంగా 200 ఎకరాల భూమి కోసం పరిశీలన చేసేందుకు సర్వే చేస్తున్నామని అధికారులు తెలిపారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సీహెచ్‌ రాజు, ఆర్‌ఐ రాజు, సర్వేయర్‌, వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉన్నారు. 


logo