గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 11, 2020 , 01:43:56

కార్మికులకు కడుపునిండా భోజనం

కార్మికులకు కడుపునిండా భోజనం

  • 54 అన్నపూర్ణ కేంద్రాలతో 14 వేల మందికి 
  • పురపాలకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  పట్టణప్రాంతాల్లో వలస కార్మికులు, దినసరి కూలీ లు, అన్నార్తులకు సుమారు 14 వేల మందికి 54 కేంద్రాల ద్వారా అన్నపూర్ణ పథకం కింద పురపాలకశాఖ కడుపునిండా భోజనం పెడుతున్నది. అత్యధికంగా వరంగల్‌ కార్పొరేషన్‌లో 11 సెంటర్ల ద్వారా 4,250 మందికి భోజన వసతి కల్పించింది. నిజాంపేటలో ఏడు, పీర్జాదిగూడలో ఐదు, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మంలలో మూడుచొప్పున, కరీంనగర్‌, బండ్లగూడజాగీర్‌, బోడుప్పల్‌, జవహర్‌నగర్‌లలో రెండేసి కేంద్రాల ద్వారా భోజనాలు పెడుతున్నారు. మిగతాచోట్ల ఒక్కో అన్నపూర్ణ కేంద్రాన్ని పురపాలకశాఖ ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సుమారు 28 పట్టణాల్లో 463 లేబర్‌ క్యాంపుల్లో సుమారు 71 వేల మంది వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. తర్వాత వరంగల్‌ కార్పొరేషన్‌లో తొమ్మిది వేలు, రామగుండంలో 6,000 మందికి ఆహారాన్ని అందజేస్తున్నారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో సుమారు 3,700 మంది నిరాశ్రయులు, అభాగ్యులకు ఉచితంగా వసతితోపాటు భోజన సదుపాయాన్ని అందజేస్తుండటం విశేషం.


logo