బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 16:30:37

నగరంలో వలస కూలీల కోసం ఆహార కేంద్రాలు ప్రారంభం

నగరంలో వలస కూలీల కోసం ఆహార కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్‌ : నగరంలోని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వలస కూలీల కోసం ఆహార కేంద్రాలను నేడు ప్రారంభించారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీల కోసం నాచారం, మల్లాపూర్‌ ప్రాంతాల్లో ఈ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 2,500 మంది కూలీలకు ఆహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ రోజుల్లో ఆహార కేంద్రాలు కొనసాగుతాయన్నారు. జ్వాల యోగి ట్రస్ట్‌, హెల్పింగ్‌ హాండ్స్‌ ఆధ్వర్యంలో ఆహార కేంద్రాల నిర్వహణ కొనసాగనున్నట్లు వెల్లడించారు.


logo