శనివారం 30 మే 2020
Telangana - Mar 30, 2020 , 01:48:08

కరోనా కట్టడే అందరి లక్ష్యం

కరోనా కట్టడే అందరి లక్ష్యం

జూబ్లీహిల్స్‌ జోన్‌ బృందం : కరోనా కట్టడే అందరి లక్ష్యమని డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ అన్నారు. బోరబండ వినాయకరావు నగర్‌లోని షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆదివారం వివిధ ఆలయాల కమిటీల ప్రతినిధులు, అర్చకులకు ప్రత్యేకించి సమావేశాన్ని నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎర్రగడ్డ రైతుబజార్‌లో వ్యాపారులకు, వినియోగదారులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధి మహ్మద్‌సర్దార్‌ వివరించారు. షేక్‌పేట్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌  పిచికారి చేశారు. 

కూకట్‌పల్లిలో...

కూకట్‌పల్లి జోన్‌ బృందం: కూకట్‌పల్లి జంట సర్కిళ్ల పరిధిలో లాక్‌ డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో రసాయనాల పిచికారి, పారిశుధ్ర కార్మికులకు కురగాయలు పంపిణీ చేశారు. కేపీహెచ్‌బీకాలనీలోనూ పారిశుధ్య కార్మికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. కార్మిక విభాగం నాయకులు రవిసింగ్‌ ఆధ్వర్యంలో నిమ్స్‌ వైద్యశాల వద్ద వైద్యశాల వద్ద రోగుల సహాయకులకు, యాచకులను ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 

సామాజిక దూరాన్ని పాటించండి : ఎమ్మెల్యే మాగంటి

వెంగళరావునగర్‌ : కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కోరారు. ఆధివారం వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. వైరస్‌ విస్తరించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేస్తున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 

మేడ్చల్‌లో... 

మేడ్చల్‌ జోన్‌ బృందం : మేడ్చల్‌లో స్థానికులకు కరోనాపై అవగాహన కల్పించారు. 44వ జాతీయ రహదారి, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో పేదలు, వలసకూలీలకు అన్నదానం చేశారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేశా రు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. మేడ్చల్‌ మండల పరిధిలోని డబిల్‌పూర్‌, ఘట్‌కేసర్‌లో ఇంటింటికి కూరగాయలను సరఫరా చేశారు. కీసరలో స్నేహ కాలనీ, వన్నీగూడ గ్రామస్తులకు 5కిలోల బియ్యం, కూరగాయలను పంపిణీ చేశారు. శామీర్‌పేట మండలంలో షెల్టర్‌ జోన్లు ఏర్పాటు చేసి వలస కూలీలకు భోజనం, వసతి కల్పించారు. 

కంటోన్మెంట్‌లో...

కంటోన్మెంట్‌ జోన్‌ బృందం: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే అనాథలు, భిక్షాటకులు, వివిధ రాష్ర్టాలకు చెందిన రైల్వే ప్రయాణికులను జీహెచ్‌ఎంసీ అధికారులు చేర దీశారు. సుమారు 200మందిని మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌లోని మల్టీపర్పస్‌ కమ్యూనిటీహాల్‌లో వసతి ఏర్పాటు చేసి భోజనం అందిస్తున్నారు. మోండా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు హరికృష్ణ రైల్వే ప్రయాణికులకు, అనాథలకు, భోజనాన్ని అందజేసి వైద్యపరీక్షలు నిర్వహించారు. కంటో న్మెంట్‌ ఆరో వార్డు పరిధిలోని మహాత్మానగర్‌, నందమూరినగర్‌, పార్కు వ్యూ ఎన్‌క్లేవ్‌, సిఖ్‌విలేజ్‌ ప్రాంతాల్లో బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

సనత్‌నగర్‌లో పకడ్బందీగా... 

సనత్‌నగర్‌ జోన్‌ బృందం: బన్సీలాల్‌పేట్‌లో జరుగుతున్న డబుల్‌ బెడ్రూం భవన నిర్మాణ ప్రదేశాలను జీహెచ్‌ఎంసీ అధికారులు సందర్శించారు. ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి ఆహారం, ఆరోగ్యంపై ఆరా తీశారు. గాంధీ దవాఖానలోని ప్రధాన భవనాల చుట్టూ ఆదివారం జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ఫోర్స్‌ విభాగం ఆధ్వర్యంలో క్రిమిసంహారక మందును పిచికారి చేశారు.అమీర్‌పేట్‌ చౌరస్తాతోపాటు ఎస్‌ఆర్‌నగర్‌ పరిధిలోని పలు చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులకు అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి సోదరుడు ఏజీ గ్లాస్‌ ప్యాక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాంబాబు బాదం పాలు, బిస్కట్లు, మంచినీటి బాటిళ్లు, పండ్లు, మాస్కులను అందజేశారు. ఎస్‌ఆర్‌నగర్‌, బల్కం పేట్‌, డీకేరోడ్డు, సత్యం థియేటర్‌, సారథి స్టూడియో చౌరస్తా, కనకదుర్గమ్మ ఆలయం రోడ్డు చౌరస్తాల్లో ఆహారసామగ్రిని కార్పొరేటర్‌ శేషుకుమారితో కలిసి పోలీసులకు అందజేశారు. 

అబిడ్స్‌లో...

అబిడ్స్‌ జోన్‌ బృందం: కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బం దీగా అమలుచేసేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉదయం పాలు, కూర గాయలు, నిత్యావసర సరుకులను ఆయా దుకాణాల వద్ద ప్రజలు సామాజిక  దూరం పాటించి కొనుగోళ్లు చేస్తున్నారు. ఆదివారం మంగళ్‌హాట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌ తన డివి జన్‌లో నిరుపేదలకు ఆహారప్యాకెట్లను పంపిణీ చేశారు. అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద టీ.పీసీసీ కార్యదర్శి జినరేందర్‌యాదవ్‌ పోలీస్‌ సిబ్బందికి బిస్కెట్లు, పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు మమతాసంతోష్‌గుప్తా ఇంటింటా ఎం టమాలజీ సిబ్బందితో రసాయనాలను పిచికారి చేయించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు రాకేష్‌ జైస్వాల్‌ కోరారు. అనంతరం ఇంటింటా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలు సామా జిక దూరం పాటించాలని గోషామహల్‌ కార్పొరేటర్‌ ముఖేష్‌సింగ్‌ సూచించారు.

చార్మినార్‌ డివిజన్‌లో...

చార్మినార్‌/చాంద్రాయణగుట్ట: లాక్‌డౌన్‌లో భాగంగా కిషన్‌బాగ్‌, రమ్నాస్‌పుర, దూద్‌బౌలి తదితర ప్రాంతాల్లో బహదూర్‌పుర టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మీర్‌ ఇనాయత్‌అలీ భాఖ్రీ ఆదివారం వెయ్యికుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను  పంపిణీ చేశారు. అలాగే హుస్సేనీఅలం ప్రాంతంలోనూ టీపీసీసీ కోఆర్డినేటర్‌ సభ్యుడు పులిపాటి రాజశేఖర్‌ బియ్యం, పప్పులతోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సామాజికవేత్త సదానంద్‌ 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించారు. పాతబస్తీ లాల్‌దర్వాజలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వేదపండితులు మహారుద్రయాగం నిర్వహించారు. 

ఆపదలో ఆదుకోవాలి: ఎమ్మెల్యే కౌసర్‌మోయినుద్దీన్‌

కార్వాన్‌ జోన్‌ బృందం: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కార్వాన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మోయినుద్దీన్‌ అన్నారు. ఆదివారం టోలిచౌకి, నానల్‌నగర్‌, గోల్కొండ ప్రాంతాల్లో కార్పొరేటర్‌ ఎండీ నసీరొద్దీన్‌తో కలిపి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అంతేకాకుండా నానల్‌నగర్‌ హకీంపేట్‌ తదితర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారి చేయించారు. 

మణికొండ డివిజన్‌లో...

మణికొండ, నమస్తే తెలంగాణ: బండ్లగూడ శ్రీ విజ్ఞాన్‌కళాశాల ఆధ్వర్యంలో పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపాలిటీ పారిశుధ్య, ఆశ కార్మికులకు ఉచితంగా శానిటైజర్‌, గ్లౌజులు, మాస్క్‌లను పంపిణీ చేశారు. కోకాపేట రాజపుష్ప అపార్టుమెంటులో నివాసముంటున్న ఓ కుటుంబానికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతాన్ని వైద్యాధికారులు జల్లడపతున్నారు. ఆదివారం అపార్టుమెంటు నివాసితులతోపాటు కోకాపేట రాజీవ్‌గృహకల్ప ప్రాంతాల్లో వైద్యాధికారుల బృందం పర్యటించింది. లాక్‌డౌన్‌ విజయవంతం చేయాలని శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని భవననిర్మాణాల్లో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో నిత్యాన్నదానాలను చేపడుతున్నట్లు కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని సింప్లెక్స్‌ మైదానానికి కూరగాయల మార్కెట్‌ను తరలించారు. నేటి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌, రాళ్లగూడ అవుటర్‌ రింగ్‌ రోడ్డు, జడ్పీ హైస్కూల్‌ మైదానం, ఆర్‌.బి.నగర్‌ హనుమాన్‌ మైదానాల్లో 4 చోట్ల రైతు బజార్లు కొనసాగుతాయని చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, కమిషనర్‌ తెలిపారు.logo