ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 14:37:15

కరోనాతో జానపద కళాకారుడు కొంకాల శంకర్ మృతి

కరోనాతో జానపద కళాకారుడు కొంకాల శంకర్ మృతి

మహబూబాబాద్ : జానపద కళాకారుడు, సినీనటుడు, గాయకుడు, కొంకాల శంకర్ కరోనా బారిన పడి మృతి చెందారు. జిల్లాలోని కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన శంకర్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. గూడూరు కొవిడ్ కేంద్రంలో చికిత్స పొంది ఈ మధ్యనే ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. శ్వాస సమస్య తీవ్రమవడంతో మహబూబాబాద్ కొవిడ్ కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

జానపద కళాకారునిగా గుర్తింపు పొందిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను  ప్రజలకు చేరవచేసేందుకు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన రాష్టం ఏర్పాటైన అనంతరం సాంసృతిక సారధిగా నియామకం అయ్యారు. పలు సీరియల్స్, సినిమాల్లో నటించారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


logo