ఆదివారం 31 మే 2020
Telangana - May 09, 2020 , 16:37:18

నగరంలో తెరుచుకున్న ఫ్లైఓవర్లు

నగరంలో తెరుచుకున్న ఫ్లైఓవర్లు

హైదరాబాద్‌ : నగరంలోని ఫ్లైఓవర్లు తెరుచుకున్నాయి. వాహనాల రాకపోకలకు వీలుగా నగరంలోని ఫ్లైఓవర్లను ట్రాఫిక్‌ పోలీసులు నేడు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపులతో నగరంలో వాహనాల రద్దీ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. సాధారణ రోజులతో పోల్చితే 30 శాతం వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాహనాల రద్దీ పెరగడంతో ఇన్నాళ్లుగా బారికేడ్లతో బంద్‌ చేసిన ఫ్లైఓవర్లను ట్రాఫిక్‌ పోలీసులు నేడు తెరిచారు. 


logo