బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 03:29:14

వ్యాగన్ల ద్వారా ఫ్లైయాష్‌ రవాణా

వ్యాగన్ల ద్వారా ఫ్లైయాష్‌ రవాణా

జైపూర్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి విద్యుత్‌ కేంద్రం నుంచి ఫ్లైయాష్‌ (బూడిద)ను వ్యాగన్ల ద్వారా సరఫరా చేయడాన్ని సోమవారం అధికారులు ప్రారంభించి మరో నూతన ఘట్టానికి తెరలేపారు. గతంలో రోజుకు 140 నుంచి 150 లారీల ద్వారా 4,500 టన్నుల ఫ్లైయాష్‌ను తరలించేవారు. లారీల ద్వారా తరలించడం వల్ల కాలుష్యంతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ సమస్య ఉండదని ఎస్టీపీపీ ముఖ్య సాంకేతిక సలహాదారు సంజయ్‌కుమార్‌ ష్యూర్‌ తెలిపారు. ప్రస్తుతం వ్యాగన్ల ద్వారా ఒకేసారి 3,600 టన్నులు 120 ట్యాంకర్ల యాష్‌ను తరలించనున్నట్లు చెప్పారు. 


logo