శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 11:47:01

ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద ..16 గేట్ల ఎత్తివేత

ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద ..16 గేట్ల ఎత్తివేత

నిజామాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి గంటగంటకు వరద ఉధృతి పెరుగుతున్నది. 74,894 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. అధికారులు 16 వరద గేట్లను 2 అడుగుల ఎత్తులో ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నది లోకి వదులుతున్నారు. నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తుండటంతో మత్తడి పోస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు మత్తడి పోస్తున్నది. వస్తున్న భారీ వానతో అలుగు పారుతోంది. నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. వరద వస్తుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. అలాగే ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్..

సింగీతం ప్రాజెక్టు..

కల్యాణి ప్రాజెక్టు..
logo