శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 09:10:40

బ్రిడ్జిపై వ‌ర‌ద నీరు..24 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

బ్రిడ్జిపై వ‌ర‌ద నీరు..24 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

మంచిర్యాల:  మంచిర్యాల జిల్లాలో రెండు రోజులుగా కుండ‌పోత ‌వర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేమనపల్లి  మండలంలో కురిసిన భారీ వర్షంతో నీల్వాయి ప్రాజెక్టు మత్తటి పోసింది. వ‌ర‌ద నీరు దిగువన నీల్వాయి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనపై  ప్రవహిస్తోంది.  దీంతో 24 గ్రామాలకు వాహ‌న రాక‌పోక‌లు స్తంభించిపోయాయి. మ‌రోవైపు ప్రాణహిత నది సైతం పరవళ్లు తొక్కుతోంది.

ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక పరి‌సర ప్రాంతాల్లో 3.6 కిలో‌మీ‌టర్ల నుంచి 4.5 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తుం‌ది. వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 2.2 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు మ‌రో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డ‌గా..వీటి ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు‌చోట్ల ఇవాళ, రేపు ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు వానలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ఇప్ప‌టికే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo