శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 10:18:45

తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటి మట్టం

తుంగభద్ర డ్యాంలో పెరుగుతున్న నీటి మట్టం

  • ఇన్ ఫ్లో లక్ష 8 వేల 915 క్యూసెక్కులు 
  • అవుట్ ఫ్లో 9,357 క్యూసెక్కులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ 63.102 టీఎంసీలు
  • పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం 1621.75 అడుగులు
  • తుంగ నది నుంచి 70,876 క్యూసెక్కుల వరద

మహబూబ్ నగర్ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం టీబీ డ్యాంకు లక్ష 8 వేల 915 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా, అవుట్ ఫ్లో 9,357 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 100 టీఎంసీలు కాగా... ప్రస్తుతం డ్యాంలో 63.102 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రస్తుతం 1621.75 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. తుంగ డ్యాం నుంచి 70,876 క్యూసెక్కుల వరద టీబీ డ్యాంకు చేరుతుందని పేర్కొన్నారు.


logo