గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 10:58:49

తుంగభద్ర జలాశయానికి మళ్లీ పోటెత్తిన‌ వరద

తుంగభద్ర జలాశయానికి మళ్లీ పోటెత్తిన‌ వరద

ఇన్ ఫ్లో 33,022 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 282 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 29.786 టీఎంసీలు
పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 1606.97 అడుగులు 

జోగులాంబ గ‌ద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ  పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాం కు వరద వచ్చిచేరుతోంది. సోమవారం టీబీ డ్యాం కు 33,022 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 282 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 29.786 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1606.97 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


logo