శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 09:14:29

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. సాగర్‌ కూడా వరద కొనసాగుతుండడంతో.. నీటి మట్టం పెరిగిపోతోంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు. ఇన్‌ఫ్లో 21,500ల క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 1163 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 169 టీఎంసీలు. 


logo