శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 11:11:39

మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు భారీగా వ‌ర‌ద నీరు

మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు భారీగా వ‌ర‌ద నీరు

రంగారెడ్డి : ‌మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. పెద్ద చెరువు, మంత్రాల‌, సందె చెరువుకు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. మీర్‌పేట చెరువు క‌ట్ట బ‌ల‌హీనంగా మారింది. జ‌ల‌దిగ్బంధంలోనే ప‌దుల సంఖ్య‌లో కాల‌నీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్ల‌లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు అధికారులు, ప్రజాప్ర‌తినిధులు త‌ర‌లిస్తున్నారు. చెరువు క‌ట్ట తెగే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌జ‌ల‌ను కార్పొరేట‌ర్లు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.