శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 12:32:09

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

  • ఇన్ ఫ్లో 15,512 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో 201 క్యూసెక్కులు
  • పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ 37.978 టీఎంసీలు
  • పూర్తి నీటి మట్టం 1633 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం 1611.39 అడుగులు

జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద    పెరుగుతోంది. ఎగువన విస్తారంగా కురుస్తున్న  వర్షాలకు టీబీ డ్యాం కు వరద వచ్చిచేరుతోంది. శనివారం టీబీ డ్యాం కు 15,512 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 201 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 37.978 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1611.39 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువ నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.


logo