గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 18:36:50

పాలేరుకు పోటెత్తిన వరద..పూర్తిస్థాయిలో నిండిన జలాశయం

పాలేరుకు పోటెత్తిన వరద..పూర్తిస్థాయిలో నిండిన జలాశయం

ఖమ్మం : ఎగువ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయాలనికి వరద నీరు పోటెత్తడంతో జలాశయం పూర్తిగా నిండింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 11వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు.  జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిగా నిండింది. ఇన్‌ ఫ్లో అవుట్‌ ఫ్లో సమానంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. జలాశయంలో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశారు. 


logo