శనివారం 04 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 17:40:09

నేడు పలువురి పోలీస్‌ ఉన్నతాధికారుల పదవీ విరమణ

నేడు పలువురి పోలీస్‌ ఉన్నతాధికారుల పదవీ విరమణ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నేడు పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందుతున్నారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్లారెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, వరంగల్‌ సీపీ రవీందర్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌రాజ్‌ నేడు పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీ సంజయ్‌కుమార్‌కు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌కు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా వరంగల్‌ సీపీ బాధ్యతలు సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు, మాదాపూర్‌ డీసీపీ బాధ్యతలు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు, నిర్మల్‌ ఎస్పీ బాధ్యతలు ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌కు అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. 


logo