బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:44:38

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు ఐదుగురు అరెస్టు

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు ఐదుగురు అరెస్టు
  • వాహనతనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు

కొత్తగూడెం క్రైం: మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూ డెం ఓఎస్డీ రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ రూరల్‌ పోలీసులు ఆదివారం మండలంలోని జగన్నాథపురం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా రెండు బైక్‌లపై వస్తున్న ఆరుగురి వద్ద ఐడియల్‌ బూస్టర్లు- 27, జిలెటిన్‌ స్టిక్స్‌-40, డిటోనేటర్లు-40, మూడు సెల్‌ఫోన్లు, రూ. 57,500  స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పానెం సారయ్య, కొమరం సమ్మ య్య, జర్పుల మనుమంతు, కుర్సం ముర ళీ, కాక నాగేశ్వరావుగా గుర్తించారు. రవి అనే వ్యక్తి పరారయ్యాడు. మావోయిస్టు నేతలు ఆజాద్‌, హరిభూషణ్‌, లచ్చన్నకు మందుగుండు సామగ్రి అందజేసేందుకు వెళ్తున్నట్టు వెళుతున్నట్లు వారు విచారణలో అంగీకరించారు.  
logo