బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 01:15:22

సింగరేణికి ఐదు కొత్త ప్రాజెక్టులు

సింగరేణికి ఐదు కొత్త ప్రాజెక్టులు

  • యంత్రాల కొనుగోలుకు బోర్డు ఆమోదం

హైదరాబాద్‌/మంచిర్యాల, నమస్తేతెలంగాణ: కొత్తగా ఐదు ప్రా జెక్టులకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. డోర్లీ ఓసీపీ, విస్తర ణ, జీడీకే-7 ఎల్‌ఈపీ ఓసీ తదితర ప్రాజెక్టులతోపాటు వివిధ గను ల్లో పనుల కోసం 60 టన్నుల సామర్థ్యం కలిగిన 25 డంపర్లను కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం జరిగింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జేవీఆర్‌ ఓసీ-2, మందమర్రి ఏరియా పరిధిలోని కేకే ఓసీ ప్రాజెక్టుల ఓబీ కాంట్రాక్టు పనుల కు బోర్డు ఆమోదం తెలిపింది. కరోనా వైరస్‌ విస్తరించకుండా శానిటైజేషన్‌ చేయడం, మాస్కుల పంపిణీ, దవాఖానల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు, భౌతికదూరం పాటించడం తదితర చర్యలపై బోర్డు సంతృప్తి వ్యక్తంచేసింది. డైరెక్టర్‌ ముకేశ్‌ చౌదరి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నియమితులైన అజితేశ్‌కుమార్‌ (డిప్యూటీ సెక్రటరీ బొగ్గు మంత్రిత్వశాఖ)కు బోర్డు ఆహ్వానం పలికింది. logo