ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:32:35

గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్‌ హతం

 గడ్చిరోలిలో  ఐదుగురు నక్సల్స్‌ హతం

కొత్తగూడెం/మంగపేట: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఆదివారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు గడ్చిరోలి ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. ‘ధనోరా తాలూకాలోని  అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నది. కాల్పులు జరిపిన నక్సల్స్‌ అక్కడి నుంచి పారిపోగా పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

ములుగులో ఇద్దరు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లా మంగపేట ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మంగపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌  నిర్వహిస్తుండగా  కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


logo