శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 18:25:44

గాంధీ నుంచి మరో ఐదుగురు డిశ్చార్జ్

గాంధీ నుంచి మరో ఐదుగురు డిశ్చార్జ్

సూర్యాపేట : కరోనా పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రంలోనే  అత్యధికంగా నమోదైన జిల్లాగా సూర్యాపేట నిలిచింది. అయితే కరోనా నివారణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్రంగా శ్రమించారు. వారు కృషి ఫలించి సత్ఫలితాలు వస్తున్నాయి. జిల్లాలో పాజిటివ్‌ కేసులు తగ్గడంతో పాటు చికిత్స పొందున్న వారుకూడా వేగంగా కోలుకుంటున్నారు. జిల్లాలోని పాజిటివ్ కేసులకు సంబంధించి మరో ఐదుగురు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఐనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబ శివరావు తెలిపారు. మొత్తం 83 పాజిటివ్ కేసుల్లో 67మంది  డిశ్చార్జ్  కాగా ఇంకా 16 మంది  చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 


logo